Jul 07,2023 20:59
  • బీజింగ్‌లో అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌ పర్యటన

బీజింగ్‌ : చైనా, అమెరికాల మధ్య దెబ్బతిను ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రస్తుతం అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌ బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. అమెరికా కంపెనీల పట్ల చైనా ప్రభుత్వ వ్యవహార శైలిని జానెత్‌ విమర్శించారు. అలాగే సెమీ కండక్టర్లలో ఉపయోగించే లోహాలపై చైనా కొత్తగా ఎగుమతి కంట్రోళ్ళు విధించడానిు కూడా విమర్శించారు. వ్యాపారవేత్తల బృందంతో మాట్లాడుతూ యెలెన్‌, సాంకేతికతల ఎగుమతులపై అమెరికా కంట్రోళ్ళను సమర్ధించుకున్నారు. జాతీయ భద్రతకు ఇది అవసరమని అన్నారు. చైనా నుండి అమెరికా ఆర్థిక వ్యవస్థను వేరు చేయడానికి ప్రయతిుస్తున్నామను సూచనలను ఆమె తిరస్కరించారు. చైనాతో ఆరోగ్యకరమైన ఆర్థిక పోటీనిఅమెరికా కోరుకుంటోందని యెలెన్‌ చెప్పారు. ఈ మేరకుఅమెరికా ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. '' తన ప్రభుత్వ రంగ సంస్థలకు, దేశీయ సంస్థలకుసబ్సిడీలను విస్తరించడం వంటి మార్కెట్‌యేతర సాధనాలను చైనా ఉపయోగించడం, విదేశీ సంస్థలకుమార్కెట్‌ సౌలభ్యానికి గల అవరోధాల గురించి అమెరికా వాణిజ్యవర్గం వ్యక్తం చేసిన ఆందోళనలను నేను ఇక్కడ వీరికి తెలియచేస్తున్నా' అనియెలెన్‌ పేర్కొన్నారు. దశాబ్దాల కాలంలో ఎనుడూ లేనిరీతిలో ఇటీవల కాలంలో అమెరికా, చైనా సంబంధాలు చాలా క్షీణించాయి. సాంకేతికత, భద్రత, ఇతరత్రా అంశాలపై వివాదాలే ఇందుకు కారణంగా వున్నాయి. పదవీ విరమణ చేస్తును చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ గవరుర్‌ యీ గాంగ్‌, మాజీ ప్రధానిలియూ హీలతో యెలెన్‌ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ పర్యటనా సమయంలో చైనా నేత జిన్‌పింగ్‌తో యెలెన్‌ సమావేశం కాబోరని ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ప్రధాన వివాదాలపై పెద్ద పురోగతులేమీ ఆశించనక్కరలేదనివారు తెలిపారు. సంబంధాల మెరుగుకు చర్యలు తీసుకోవాలనిగత నవంబరులో ఇరు దేశాల అధినేతలు సమావేశమై ఒక అంగీకారానికి వచ్చారు. ఆ ఒప్పందానిు ముందుకు తీసుకెళ్ళే దిశగా యెలెన్‌ పర్యటన ఒక నిర్దిష్టమైన చర్య అనిచైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. వాణిజ్య యుద్ధాల్లో లేదా సంబంధాలను తెంచుకోవడంలో ఎవరూ విజేతలు కాదు అనిఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు అమెరికా నిర్దిష్ట చర్యలు తీసుకుంటుందని ఆశిస్తునుట్లు ఆ ప్రకటన పేర్కొంది.