
- విన్యాసాల్లో విమాన వాహక నౌకలు, రాకెట్లు, ఫైటర్ జెట్లు, క్షిపణులు
బీజింగ్: తైవాన్ ద్వీపంపై తన ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే ఎటువంటి యత్నాన్ని అయినా తిప్పికొట్టేందుకు చైనా సైనికంగా సంసిద్ధమవుతోంది. ద్వీపం చుట్టూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ)సైనిక విన్యాసాలను ముమ్మరం చేసింది. సైనిక సన్నద్ధతను చాటిచెప్పే డ్రిల్లులో యుద్ధ విమాన వాహక నౌకలు, సుదూర రాకెట్లు, ఫైటర్ జెట్లు, క్షిపణులు పాల్గనాుయి. 'జాయింట్ స్వోర్డ్' పేరుతో ద్వీపానికి నలువైపులా పిఎల్‌ఎ తూర్పు థియేటర్ కమాండో దళం విన్యాసాలను ముమ్మరం చేసినట్లు చైనీస్ సెంట్రల్ టెలివిజన్ చానెల్ (సిసిటివి) తెలిపింది. నిర్దేశిత లక్ష్యాలను క్షణాల్ల్లో ఛేదించడం, సముద్ర భాగానిు, గగనతలానిు అదుపులోకి తీసుకుని, అడ్వాంటేజ్ పొజిషన్ తీసుకోవడంలో టాస్స్‌ఫోర్స్ సామర్థ్యానిు, సనుద్ధతకు ఈ విన్యాసాలు ఒక పరీక్ష వంటి వనిసిసిటివి తెలిపింది. చైనా మిలిటరీ అకాడెమీ సైన్స్ పరిశోధకుడు జావో సియాఝవా గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడుతూ, పెద్దయెత్తున నిర్వహిస్తును జాయింట్ కమాండో విన్యాసాల్లో చైనా ఆర్మీకి సంబంధించిన అనిు విభాగాల సాయుధ సంపత్తిని ప్రదర్శిస్తున్నారని అన్నారు. బయటి శక్తులు ఏవైనా దాడి చేసేందుకు యతిుంచిన పక్షంలో సమాచారం, కమ్యూనికేషన్ నెట్‌వర్కుపై అదుపు, రాడార్ పై ఎలక్ట్రానిక్ సప్రెషన్ నిర్వహించడం, తైవాన్‌లోని యాంటీ మిస్సెల్స్ స్థావరాలపై పట్టు సాధించడం ఇదే ఈ డ్రిల్లు ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.