చెలికాడు దాహమేసి మాపటేల
ఉండలేక వెతకబోయే చీకటేల
ఊట లేక చెలమ ఎండిపోయే
ఎండ వేళ
చిత్తమంతా చిన్నబోయే
మసక వేళ
తాడు లేని బొక్కెనేసే తాళలేక
దాహమంతా మునకలేసే తాగలేక
పాల పొంగులన్నీ ఎదురుచూసే
తోడు లేక
మనసంతా తిరగలేని బొంగరమయ్యే జ్యాల లేక
ఆశలన్నీ తొంగి చూసే కలువలేక
మబ్బులన్నీ తొలగిపోయే చూడలేక
ఆరాటాల మనసులోన
ఆశ పుట్టే
చందమామ జాలి వేసి
వెన్నెల పట్టే
చెలికాడు ఊహల చెలిని జేరి
రెక్కల గుర్రమెక్కి దౌడుబెట్టే!
పి.బక్కారెడ్డి
97053 15250