Jan 27,2023 16:28

ప్రజాశక్తి-కంచికచర్ల : కంచికచర్ల గ్రామ పంచాయతీ ఏరియాలో ప్రజలు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా విభజించి పంచాయతీ సిబ్బందికి సహకరించాలని పంచాయతీ కార్యదర్శి కనగాల రవికుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పలు ప్రాంతాలలో క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ వాహనంలో ప్రయాణించి తడి పొడి చెత్త సేకరణ విధానం తనిఖీ చేశారు. గ్రామం లో పలు ప్రాంతాలలోని ప్రజల ఫిర్యాదులు మరియు పరిష్కారాలు చేస్తూ ప్రత్యేక ఆకర్షితులయ్యారు. ప్రతి ప్రాంతం వెళ్లి ప్రజలను స్వయంగా పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ వచ్చి ఈ ప్రాంతంలో శుభ్రం చేసి చెత్త తీసుకు వెళుతున్నారా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు స్వయంగా తనకు అందించిన ఫిర్యాదుల మేరకు పట్టణంలో పలు ప్రాంతాలలో తానే స్వయంగా పర్యటించడం జరిగిందని తెలిపారు.పంచాయితీ సిబ్బంది ప్రతిరోజు ప్రతి వీధి పరిశుభ్రం చేస్తున్నారని ప్రజలు ఇళ్ల మధ్యలో చెత్త ఎక్కడబడితే అక్కడ వెయ్యకుండా నిల్వచేసి పంచాయతీ సిబ్బంది వచ్చినప్పుడు అందించాలని,  తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా అందించి పంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.