Sep 23,2023 15:03

ప్రజాశక్తి-పొదిలి : ప్రకాశం జిల్లా పొదిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర సాధారణ తనిఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కార్డ్ 210 పైలేట్ ప్రాజెక్టు విజయవంతం అయిందని ప్రజలకు కూడా సంతృప్తికరంగా ఉన్నారని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమలు అవుంతుందన్నారు. ఈ ప్రక్రియ వల్ల రిజిస్ట్రేషన్ అత్యంత వేగంగా ఉంటుందని గంటలతరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ విధానంపై ఎటువంటి అపోహలు పడవల్సిన పనిలేదని అరగంటలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యి ఒరిజినల్ కాఫిలతో సహా క్రయవిక్రయా దారులు పొందవచ్చన్నారు.