Jan 22,2023 09:17

హవానా
మే 31, 1963
మోటార్‌ సైకిల్‌ అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ కామ్రేడ్స్‌,
శాంటియాగో డి క్యూబా


కామ్రేడ్‌,
మీ ప్రతిపాదనల్లో ఒక పొరపాటు ఉంది. ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహించిన కార్మికులకు దానిపై హక్కు ఉండదు. బేకరీలో పని చేసే వారికి అధిక బ్రెడ్లపై హక్కు ఉండదు. సిమెంట్‌ కార్మికులకు సిమెంటు అధికంగా పొందే హక్కు ఉండదు. అలాగే మీకు మోటారు సైకిళ్ళపై హక్కు ఉండదు. నేను మీ ఫ్యాక్టరీని సందర్శించినపుడు త్రిచక్రవాహనం ఒకదాన్ని మినీ బస్సు మాదిరిగా వాడటాన్ని గమనించాను. దాన్ని నేను విమర్శిస్తూ ఉండగానే, కమ్యూనిస్టు యువజన సంఘంలో సభ్యుడయిన ఒక కార్మికుడు ఫ్యాక్టరీకి చెందిన ఒక మోటారు సైకిల్‌పై ఆ సంఘం పని కోసం వెళ్ళడం చూశాను. దీన్ని మరింత తీవ్రంగా విమర్శిస్తున్నాను. వేతనం చెల్లిస్తూ సమాజం తనకు నిర్దేశించిన పని సమయంలో ఆ పనిని చేయకపోగా, సమాజం కోసం తాను పూర్తి స్వచ్ఛందంగా అదనపు సమయం కేటాయించి చేయాల్సిన పనిపట్ల పూర్తిగా పొరపాటు దృక్పథాన్ని ఆ కార్మికుడు కలిగి వున్నాడు. వాహనాలను కార్మికులకు, టెక్నీషియన్లకు కేటాయించే అవకాశముందా మీతో సంభాషిస్తున్న సమయంలో అని అడిగారు. అలా కేటాయిస్తే దానికి ఎలా కార్మికుడు చెల్లించాలన్న అంశాన్ని కూడా తెలియచేయాలని కోరారు. వాహనాల పంపిణీ, అమ్మకం రవాణా శాఖకు అప్పగించిన దృష్ట్యా, వాహనాలను మీరు కోరిన విధంగా కేటాయించే అవకాశం ఉంటుందని నేను భావించడం లేదు.

విప్లవాభివందనాలతో,
పాట్రియా ఓ ముయెర్టె,
వెన్సెరి మోస్‌, కమాండర్‌ ఎర్నెస్టో చేగువేరా