
డియర్ హిల్డిటా, అలైడిటా, కామిలో, సెలినా, ఎర్నెస్టో,
నేను మీతో లేను కాబట్టి ఈ లేఖ రాస్తున్నాను. ఇది మీకు అంది చదవగలిగితే నేను చెప్పే విషయాలు తెలుసుకోండి. నన్ను మీరు మర్చిపోయి ఉండవచ్చు. మీలో చిన్నవాళ్ళకు నేను అసలు గుర్తుండే అవకాశమే లేదు.
మీ తండ్రి తాను నమ్మిన ఆశయాల ప్రకారం పనిచేసే వ్యక్తి. తన సిద్ధాంతాల కోసం కచ్చితంగా నిలబడ్డ వ్యక్తి.
మంచి విప్లవకారుల్లాగా పెరగండి. కష్టపడి చదవండి. సాంకేతిక పరిజ్ఞానంపై ప్రావీణ్యం సంపాదించండి. ప్రకృతిపై అదుపును సాధించడానికి అదే ఉపయోగపడుతుంది. విప్లవం ఒక్కటే అత్యంత ప్రాధాన్యత కల్గినదని మర్చిపోకండి. వ్యక్తులుగా మనకు ఏమీ నిలువలేదు.వీటన్నింటినీ మించి, ప్రపంచంలో ఎక్కడ, ఎవ్వరికి అన్యాయం జరిగినా తీవ్రంగా ప్రతిస్పందించకలగాలి. ఒక విప్లవ వీరునికి ఉండాల్సిన అత్యంత ఉత్తమ లక్షణం ఇది.
ఎప్పటికీ మీకు వీడ్కోలు. మిమ్మల్ని మళ్ళీ చూడగలననే అనుకుంటున్నాను. మీ అందరికీ నా ముద్దులు, ఆలింగనాలు.
- నాన్న