
హవానా,
ఫిబ్రవరి 20, 1964
''ఆర్థిక వ్యవస్థ సంవత్సరం''
స్రా. మేరియా రొసారియో గువేరా
36, రూ డి అన్నామ్
మారిఫ్ క్యాస బ్లాంకౌ
మొరాకో
కామ్రేడ్,
నిజం చెప్పాలంటే మా కుటుంబం స్పెయిన్‌లో ఏ ప్రాంతం నుండి వచ్చిందో నాకు తెలియదు. మా పూర్వీకులు చాలా కాలం క్రితం పొట్టచేతబట్టుకొని ఇక్కడికి వచ్చారు. మా కుటుంబం ఒకే చోట ఉండకపోవడానికి కారణం అక్కడ సదుపాయంగా లేకపోవడమే.
మనిద్దరి మధ్య పెద్ద సాన్నిహిత్యం ఉన్నట్లు నేను భావించడంలేదు. ప్రపంచంలో అన్యాయం జరిగినప్పుడు ఆగ్రహంతో మీరు వూగిపోతున్నారంటే, మనిద్దరం కామ్రేడ్స్‌మే. అదే ముఖ్యం.
విప్లవాభివందనాలతో,
పాట్రియా ఓ ముయెర్టె, వెన్సెరి మోస్,
కమాండర్ ఎర్నెస్టో చేగువేరా