ఇంటర్నెట్ : 'చందమామ' ప్రభాకర్ గా ఆత్మీయంగా పిలుచుకునే ప్రభాకర్ కృష్ణ ఆదివారం రాత్రి 10 గంటలకు విజయవాడ గాంధీనగర్ లోని వారి స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడడంతో మరణించారు. ఈ రోజు మధ్యాహ్నం బన్సీలాల్ పేటలో అంత్యక్రియలు జరగనున్నట్లు ఆత్మీయులు తెలిపారు. ప్రభాకర్ చందమామ పత్రికతో పాటు అనేక పత్రికల్లో ఇల్యుస్టేటర్ గా పని చేశారు. డిజిటల్ ఆర్టిస్ట్ గా కూడా పని చేశారు. సంగీతం పట్ల కూడా అభిరుచి గల వారు. వారికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మరణం ఆత్మీయులందరికీ తీరని విషాదం కలిగించింది. నిరంతర బాధాతప్త జీవితంలో కళాకారుడుగా ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.