Oct 21,2022 16:38

బెంగళూరు :   గూగుల్‌కు భారత్‌ షాకిచ్చింది. గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్‌ ఇంక్‌కు భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ పరికరాలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను గూగుల్‌కు రూ. 1,338 కోట్లను జరిమానా విధించినట్లు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) జరిమానా విధించింది. అలాగే గూగుల్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ దారులకు ఎలాంటి ప్రోత్సాహకాలను అందించకూడదని ఆదేశించింది. అయితే ఈ వార్తపై గూగుల్‌ స్పందించాల్సి వుంది. గూగుల్‌ ఇప్పటికే భారత్‌లో పలు కేసులను ఎదుర్కుంటోంది.