Mar 06,2023 15:45

ప్రజాశక్తి-(ఎన్టీఆర్ జిల్లా) మైలవరం : సీపీ కాంతి రాణా టాటా ఆదేశాలతో మైలవరం డివిజన్ ఏసీపీ మారగాని రమేష్ సూచనలతో  సీఐ రమేష్, ఎస్ఐ రాంబాబు గంజాయి మూలాలపై దృష్టి పెట్టారు. నిన్న రాత్రి గంజాయి తాగుతున్న ఇద్దరిని మైలవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైలవరం గ్రామ శివారులో ఒక రియల్ ఎస్టేట్ లేఅవుట్ లో గంజాయి సేవిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద అమ్మకానికి ఉంచిన 100గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు  ఏసీపీ మారగాని రమేష్  వెల్లడించారు. మాదకద్రవ్యాలు అమ్ముతున్నట్లు తెలిస్తే రౌడీ షీట్ లు ఓపెన్ చేస్తామని ఏసీపీ తెలిపారు. యువత భవిష్యత్ ని నిర్వీర్యం చేసే చర్యలకు పాలతపడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక జారిచేశారు. డివిజన్ వ్యాప్తంగా జల్లెడపడతామని ఏసీపీ స్పష్టం చేశారు.