Jun 08,2023 16:20

ప్రజాశక్తి-ఆదోని(కర్నూల్) : ఆదోని పట్టణంలోని శంకర్ నగర్, పంజరపోలు దగ్గర కల్వర్టు ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు నీలకంఠప్ప, పట్టణ కార్యనిర్వాహణ‌ అధ్యక్షులు దిలీప్ ఢోకా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గురువారం క‌ల్వ‌ర్ట్‌ను నాయ‌కుల బృందం ప‌రిశీలించింది. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడారు. లేబర్ కాలనీకి వెళ్లే దారిని ఇరువైపులా భద్రత గోడలు నిర్మించకపోవ‌డంతో అటువైపుగా హై స్కూలుకు వెళ్లే విద్యార్థులు రోడ్డు క్రాస్ చేసి వెళ్లాలంటే భయపడుతున్నారన్నారు. రాత్రిలో రోడ్డు సరిగ్గా కనబడకుండా కాలువలో పడిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రమాదాలు జ‌ర‌గ‌క‌ముందే కల్వ‌ర్లుకు రోడ్డుకి ప్రహరీ గోడ నిర్మించాల‌ని రోడ్డు భవనాల అధికారులను కోరారు. లేనిప‌క్షంలో రోడ్డు భావనాల కార్యాల‌యం ముందు ఆందోళ‌న చేస్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి మారుతి రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సాయినాథ్, యువజన నాయకులు దేవిశెటీ వీరేష్, మద్దిలేటి, మణిక్యరాజు, సుబ్బారెడ్డి, రాము పాల్గొన్నారు.