Apr 29,2023 16:20
  •  మే 5 నుండి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ల ముట్టడి .
  • వ్యవసాయ కార్మిక సంఘం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు..

ప్రజాశక్తి-తుగ్గలి : గ్రామీణ ఉపాధి హామీ పథకం  నిర్వీర్యంకు కేంద్ర ప్రభుత్వ కుట్రలు చేస్తుందని, ఈ కుట్రలను నిరసిస్తూ పోరాటాల ద్వారా ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందామని మే నెలలో ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం జరిగే ఉద్యమాల్లో కూలీలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని మే నెల 5 నుండి  17 వరకు జరుగు కలెక్టర్ ఆఫీస్ లో ముట్టండి జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లి గ్రామంలో శనివారం నాడు ఆయన ఉపాధి హామీ పనులు పరిశీలించి కూలీలతో మాట్లాడారు ఈ సందర్భంగా వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం పై కుట్ర జరుగుతుందని పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక ఆసరాగా ఉన్నటువంటి ఈ పథకాన్ని ఎత్తివేలను కుట్ర జరుగుతున్నదని దీన్ని కాపాడేందుకు ఐక్యంగా ఉద్యమిద్దమని పిలుపునిచ్చారు ఇప్పటికే బడ్జెట్లో కోతలు  పని నిర్వీర్యానికై వివిధ నిబంధనలు పెట్టడం ద్వారా కూలీలు ఉపాధి పని పట్ల నిరాసక్తత  వ్యక్తం చేసే విధంగా ప్రభుత్వం చేస్తుందని దీని ఉపాధి కూలీలంత గమనించాలని కోరారు. ఈ నేపథ్యంలో రెండు రెండు పూటలా పని వేసవి వెలవెన్స్ రద్దు, రవాణా అలవెన్సు  రద్దు మంచినీటి అలవెన్సు రద్దు చేసిందని పోరాడి సాధించుకున్న హక్కులపై కూడా బిజెపి ప్రభుత్వం దాడి చేస్తుందని ఈ దాడికి వ్యతిరేకంగా ఇప్పటికే అఖిలభారత స్థాయిలో తీవ్ర ఉద్యమం జరుగుతుందని.. రాష్ట్రంలో కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు జయప్రదం చేయాలని కోరారు తద్వారా ఉపాధి పనులు రక్షించుకునేందుకు అందరూ కృషి చేయాలని పోరాటం ద్వారానే అందరికీ పని దొరుకుతుందని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు శ్రీనివాసులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.