Apr 30,2023 16:45

ప్రజాశక్తి - పెద్దాపురం : కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా పెద్దాపురం లో జరిగే మేడే ప్రదర్శన, అనంతరం  మెయిన్ రోడ్డు ఆంజనేయస్వామి గుడి సెంటర్లో జరిగే బహిరంగ సభలను జయప్రదం చేయాలని సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు డి క్రాంతి కుమార్,గడిగట్ల సత్తిబాబు లు విజ్ఞప్తి చేశారు.ఆదివారం స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో వివిధ కార్మిక సంఘాల నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సిఐటియు  అనుబంద కార్మిక సంఘాల కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారు.మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు మేడే జెండాల ఆవిష్కరణ చేసి 9 గంటలకు పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనం కు కార్మికులందరూ చేరుకోవాలన్నారు.యాసలపు సూర్యారావు భవనం నుండి ప్రదర్శన ప్రారంభమవుతుందని,ప్రదర్శన ముగిసిన వెంటనే ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో బహిరంగ సభ జరుగుతుందన్నారు.ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సభలో సిఐటియు నాయకులు సిరపరపు శ్రీనివాస్ ప్రసంగించారు.