ప్రజాశక్తి - బ్రహ్మంగారి మఠం : బ్రహ్మంగారిమఠం మండలంలో ఆదివారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగు పడి మండల పరిధిలోని వీరభద్రపురం గ్రామానికి చెందిన రైతు రవికుమార్ రెడ్డికి చెందిన పాడి గేదె మృతి చెందింది. గేదె మృతితో రూ.లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపాడు.బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాని గ్రామస్తుల కోరారు.










