ప్రజాశక్తి-కాకినాడ : ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సినిమా రోడ్డులోని సూర్యకళామందిరంలో మాజీమంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో జరుగు ఆత్మగౌరవ సభ విజయవంతం చేయాలని ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చొల్లంగి వేణుగోపాల్, మాట్లాడుతూ బిసి కుల భాంధవ్యులకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడిచినా దేశంలోని వెనుకబడిన వర్గాలు సామాజిక, ఆర్ధిక రాజకీయ విద్యా, ఉద్యోగాలలో సమానత్వం సమవాటా కోసం నేటికీ పోరాడాల్సిన పరిస్థితి దీనికి ప్రధాన కారణo అందరం ఏకమై ఒకే తాటిపైకి రాకపోవడమేనన్నారు. బిసిల ఐక్యత అనేది ఎన్నికల ముందు నినాదంగా మిలిపోవడంతో దీన్ని అవకాశంగా తీసుకున్న ఆధిపత్య వర్గాలు బిసిలపై దాడులు దౌర్జన్యాలకు దిగుతూ వివక్షకు గురి చేస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులలో బిసిలు ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీసీల ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 140 బి.సి. కులాలు ఐక్యమై రాష్ట్రంలో ఉన్న అన్ని బిసి. సంఘాలు, బిసి కుల సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి బిసిలపై జరుగుతున్న వివక్ష, దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి రాజకీయ పార్టీలు, సంఘాలకు ఆతీతంగా బిసిల ఆత్మగౌరవ సభను దిగ్విజయం చేయాలని కోరారు.కార్యక్రమంలో 93బీసీ ఉప కులాల రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్, గూడూరి వెంకటేశ్వరరావు, సుందరపల్లి వివి ఎస్. గోపాలకృష్ణ, కొక్కిలాగడ్డ గంగరాజు, ఒమ్మి బాలాజీ, తుమ్మల రమేష్, తదితరులు పాల్గొన్నారు.










