ప్రజాశక్తి-శ్రీకాకుళం : వైఎస్సార్సీపీ నాయకులు, 45 వ డివిజన్ ఇంఛార్జ్ కిల్లంశెట్టి అరుణ్ కుమార్ గుప్త పుట్టిన రోజును పురస్కరించుకుని స్థానిక పీఎన్ కాలనీ టెన్త్ లైన్,వీఆర్ నివాస్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. శిబిరాన్ని కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోణార్క్ శ్రీను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదానం ఆవశ్యకతను గుర్తించి ఇటువంటి శిబిరాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. కిల్లం శెట్టి అరుణ్ కుమార్ గుప్తా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆపద ఏదైనానేనున్నా అని ముందుకు వచ్చే మానవతామూర్తి ఆయన అని కితాబిచ్చారు. లయన్స్ బ్లడ్ బ్యాంక్, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్లాంక్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ పురోహితులు పన్నాల నర్సింహ మూర్తి,ఇంకా ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత అరుణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. సుదీర్ఘ కాలం వీఆర్ గుప్త ల్యాబొరేటరీ ద్వారా విశిష్ట సేవలు అందిస్తున్న ఆయనకు నగర ప్రముఖులు, పలువురు యువజన సంఘాల ప్రతినిధులు, ఫాజుల్ బేగ్ పేట పుర ప్రజలు అభినందనలు తెలిపారు.










