Jun 10,2023 16:09
  • స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరపలేదు 
  • ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి

ప్రజాశక్తి-కర్నూల్ : రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఏడో తారీఖున ప్రకటించిన మద్దతు ధర రైతులను మరొక్కసారి మోసం చేసిందని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. స్థానిక కార్మిక కర్షక భవన్లో ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు కె. వెంకటేశులు అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కె. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరపడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిందని, అందుకు ఉదాహరణ ఈనెల ఏడో తారీఖున కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర రైతులకు కంటి తుడుపు గా ఉంది తప్ప ఏమాత్రం న్యాయసమ్మతంగా లేదని పెట్టుబడి ఖర్చులు 50 నుంచి 200% పేరగగా కొరికి పత్తి, జొన్న లాంటి పంటలకు అత్యంత తక్కువ మద్దతు ధర ప్రకటించి అన్నదాతలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పంట పైన రైతులు నష్టపోతున్నారని దిగుబడి రాక ధర లేక ప్రకృతి కారణం చేత పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి వ్యవసాయం చేయలేక భూములు వదులుకొని ఇతర వృత్తులు చేసుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని కొంతమంది రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించిన పెట్టుబడి పైన 50 శాతం కనీస మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని లేకపోతే రైతులు బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ మాట్లాడుతూ జూన్ 30వ తారీఖున జరుగు విజయవాడ మహాధర్నాకు రైతాంగ సమస్యల పైన తరలి వెళ్లాలని జాతీయ రహదారులలో భూములు కోల్పోతున్న రైతులు ఆర్డీఎస్, వేదవతి కొరకు భూములు కోల్పోయిన రైతులు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని ,పంటల భీమా రైతులందరికీ ఇవ్వాలని నకిలీ విత్తనాలు అరికట్టి నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని, సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే నిర్మించే దానికోసం ప్రభుత్వం పూనుకోవాలని కోరుతూ జరుగు విజయవాడ ధర్నాకు  పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి హనుమంతు .రాష్ట్ర కమిటీ సభ్యురాలు వనజ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు. మధు, సిద్దయ్య గౌడ్ ,లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.