ప్రజాశక్తి - పెద్దాపురం : పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో గురువారం స్థానిక నువ్వుల గుంట వీధి సెంటర్లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద భగత్ సింగ్ 116వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం రొంగల అరుణ్ అధ్యక్షతన జరిగిన సభలో చిల్డ్రన్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు బుద్దా శ్రీనివాస్ మాట్లాడుతూ అతిచిన్న వయసులోనే భగత్ సింగ్ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఉరికంభమెక్కిన యువకిశోరంగా అందరిలో స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని నింపారన్నారు. ఈ కార్యక్రమంలో నువ్వుల గుంట వీధి యూత్ సభ్యులు గొర్లి రమేష్, చిన్నా, చిల్డ్రన్స్ క్లబ్ కోశాధికారి కూనిరెడ్డి రవికుమార్, ప్రజానాట్యమండలి నాయకులు ఎస్ బంగారు రాజు, దారపు రెడ్డి కృష్ణ,మహపాతిన రాంబాబు, సిఐటియు నాయకులు గడిగట్ల సత్తిబాబు,డి క్రాంతి కుమార్,ఎం నరసింహమూర్తి,కే అప్పన్న తదితరులు పాల్గొన్నారు.










