Oct 04,2023 12:21

ప్రజాశక్తి - ముద్దనూరు : స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో (కెమిస్ట్రీ) రసాయన శాస్త్రం ఉపాద్యాయులు ఎమ్ వి రమణ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. గురువారం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కడపలోని జిల్లా పరిషత్ సభా భవనంలో రమణ ఉత్తమ ఉపాద్యాయులుగా అవార్డు అందుకోనున్నట్లు బుధవారం ప్రసాధానోపాధ్యాయుల రాజబాబు తెలిపారు. పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయునికి అవార్డు రావడం పట్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు హర్షం వ్యక్తం చేశారు.