బీజింగ్ : చైనాను కట్టడి చేయడం లేదా ముట్టడించడం సాధ్యం కానిదని చైనా దౌత్యవేత్త వాంగ్ యి స్పష్టం చేశారు. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింగర్‌తో సమావేశం సందర్భంగా వాంగ్ యి మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు ఆయన చేసిన కృషిని అభినందించారు. చైనా అభివృద్ధి అనేది అంతర్‌జనితంగా సాధించబడిందని, దానికొక చరిత్రాత్మకమైన లాజిక్ వుందని, అందువల్ల చైనాను మార్చాలని ప్రయతిుంచడం సాధ్యం కానిదని ఆయన స్పష్టం చేశారు. చైనాను నియంత్రించడం లేదా చుట్టుముట్టడం కూడా అస్సలు సాధ్యం కాదని ఆయన పేర్కొనాురని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. బీజింగ్‌లో వాంగ్, కిస్సింగర్‌తో భేటీ అయ్యారు. పాత మిత్రులతో నెలకొను సుేహ బంధంగా ఆయన ఆ సమావేశానిు వ్యాఖ్యానించారు. అమెరికా పట్ల చైనా విధానం ఉనుత స్థాయి కొనసాగింపుగా వుంటుందని, అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిపాదించిన ప్రాధమిక మార్గదర్శకాల ప్రాతిపదికనే వుంటుందనివాంగ్ పేర్కొనాురు. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం, సమాన అవకాశాలు అనువి ఆ ప్రాధమిక సూత్రాలనిఆయన వివరించారు. చైనా, అమెరికా మధ్య సంబంధాలు సరైన దిశలో కొనసాగడానికి, ఒకరినిఒకరు కలుపుకునిపోవడానికి ఈ మూడు మార్గదర్శకాలు ఉపయోగపడతాయనిఅనాురు. చైనా పట్ల అమెరికా విధానానికి కిస్సింగర్ తరహా దౌత్య దార్శనికత, నిక్సన్ తరహా రాజకీయ సాహసం అవసరమనివాంగ్ వ్యాఖ్యానించారు. రిచర్డ్‌్ నిక్సన్ హయాంలో 1971 జులైలో అప్పటి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు కిస్సింగర్ రహస్యంగా బీజింగ్ వెళ్ళారు. కమ్యూనిస్టుల పాలనలోనిచైనాతో సంబంధాలు ఏర్పాటు చేసుకునే లక్ష్యంతో ఆయన పర్యటించారు.










