ప్రజాశక్తి-కర్నూల్ : మండల కేంద్రమైన హోలగుందలో గురువారం ముస్లిం సోదరులు పిల్లలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బక్రీద్ పండుగ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్థానిక పెద్ద మసీదు నుండి ముస్లిం సోదరులు అల్లాను ప్రార్థిస్తూ పురవీధుల్లో తిరుగుతూ ఆయా ఈద్గాలకు తరలి వెళ్లి నమాజ్ ప్రార్ధనలు చేశారు. హలే హదీస్ ఈద్గాలో మౌలి హబీబుల్లా ముస్లిం సోదరులకు ప్రార్థనలు చేయించారు. మౌల్వి సమీయుల ఈద్గాలో ముస్లింలనుద్దేశించి ఉపన్యాసిస్తూ దేశ పౌరులందరూ కలిసిమెలిసి ఉండాలని దేశ ఐక్యత కోసం అందరూ ఒక తాటిపై నిలవాలని కోరారు. ప్రతి మనిషి విడనాడాలని పేద వితంతు వృద్దులు బలహీనుల పట్ల ప్రతి ముస్లిం సోదరుడు విధేయుడిగా ఉండి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. అందరూ ముస్లిం సోదరులు ఇబ్రహీం ప్రవక్త ఇస్మాయిల్ ప్రవక్త అడుగుజాడల్లో నడవాలని అన్నారు. కురాన్ మరియు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం చెప్పిన సూత్రాలను తప్పక పాటించాలని ప్రపంచ శాంతి కోసం అందరూ నడుం బిగించాలని కోరారు. వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ పాడిపంటలు కాకరలాడాలంటూ దేశ ప్రపంచ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యంగా ఉండాలంటూ ప్రార్థించారు. ఈద్గా నమాజులో భారీ సంఖ్యలో మహిళ ముస్లిం మహిళలు పాల్గొన్నారు హిందూ ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆ లింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. శాలి మసీద్ రాజా నగర్ మరియు పబ్లిక్ జమాత్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ ఘనంగా జరిగింది. బక్రీద్ లో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండడానికి పత్తికొండ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, ఆలూరు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీనివాసులు నరేంద్ర భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ప్రార్థనలో ఆయా మసీదుల ముతవల్లీలు పేస్ మాములు మౌసన్ సబ్బులు ముస్లిం సోదరులు మహిళలు ప్రజలు యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.










