ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగరంలోని హిందూ కాలేజీ సెంటర్లో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జివన్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎం.ఎల్.సి. చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫ్, డిప్యూటీ మేయర్ దైమొండ్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దేవానంద్, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










