Jul 01,2023 11:46

ప్రజాశక్తి-ఆదోని : వర్షాకాలంలో వచ్చే సీజ‌న‌ల్ వ్యాధుల నివారణపై అవగాహన కలిగి ఉండాలని లైన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ డాక్టర్ గోపీనాథ్ తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లైన్స్ క్లబ్ సంయుక్తంగా శ‌నివారం ప‌ట్ట‌ణ‌ ప్రజలకు అవగాహన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వర్షాకాలంలో కలుషిత నీరు ఆహారం వల్ల కలరా, విరోచనాలు, పచ్చకామెర్లు, టైఫాయిడ్ రాకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు సంక్ర‌మిస్తాయ‌న్నారు. వ్యాధులు సోక‌కుండా దోమ‌తెర‌లు వాడాల‌ని, నీరు నిలువ ఉండకుండా చూసుకోవడం, నీటిని కాచి చ‌ల్లార్చి వ‌డ‌బోసి తాగాల‌న్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు  దేశాయి, కృష్ణమూర్తి, సూరదాస్, కిరణ్ కుమార్, శివరాం, హరీష్, అనూష, మాయ, ల‌య‌న్స్‌ క్లబ్ అధ్యక్షుడు ధర్మారెడ్డి, కార్యదర్శి వెంకటేష్ బాబు, ఈసీ మెంబర్స్ నీల మోహన్, కిరణ్ పాల్గొన్నారు.