May 17,2023 16:18
  • రాజపుడి పీహెచ్ సి వైద్యురాలు గౌతమి

ప్రజాశక్తి - జగ్గంపేట రూరల్ : వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండుట వలన వాతావరణం లో ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు వడదెబ్బ కు గురి అయ్యే ప్రమాదం ఉన్నదని రాజపూడి పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డా . కె . గౌతమి తెలియ జేసారు . గురువారం మండలం లోని  రాజపూడి పి హెచ్ సి లో  ఆరోగ్య సిబ్బందికి సమావేశము ఏర్పాటు చేసి తగు సూచనలు ఆదేశములు జారీ చేసారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ఆరోగ్య సిబ్బంది  ప్రజలకు అవగాహన కల్గించాలని ఆదేశించారు  . ఎండ తీవ్రత వల్ల శరీర  ఉష్ణోగ్రత కూడా 104.9 F వరకు పెరిగి మెదడు మీద ప్రభావం చూపుతుందనీ,  దీనివలన  మెదడు లోని ఉష్ణోగ్రత ను నియంత్రించే కేంద్రం ( హైపో ధరామ స్) దెబ్బతిని వడదెబ్బకు గురి అవుతారన్నారు .ఎండలో తిరగటం వలన వేడిమికి చెమట పట్టి శరీరం లో ని లవణాలు ,నీటి శాతం తగ్గి డీ హైడ్రేషన్ కు గురి అవుతారనీ ఇది ప్రమాదకరం మరియు ప్రాణాంతకమన్నరు.  

వడదెబ్బ లక్షణములు:  చెమట పట్టక పోవడం ,శరీర ఉష్ణోగ్రత లు పెరగటం ,వణుకు పుట్టడం ,మగత నిద్ర లేదా కలవరింతలు , ఫిట్స్ లేదా పాక్షికముగా అపస్మారక స్తితిలోలో ఉండటం మొదలయిన లక్షణాలు ఉంటాయి. వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు  జాగ్రత్తలు పాటించాలని కోరారు . ఆరుబయట వృత్తి పనులు, కూలి పనులు చేసుకునేవారు ఉదయం 10 లోపు మరియు సాయంత్రం 4 గంటల తరువాత పని చేసు కోవాలి . వృద్దులు –చిన్న పిల్లలు –దీర్గకాలిక వ్యాధులు ఉన్నవారు –గర్భిణి స్త్రీ లు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలి . తరచుగా మంచి నీరు గాని పళ్ళ రసాలు గాని  ఎక్కువగా తీసు కోవాలి. ఎండలోప్రయాణములు  చేయరాదనీ, . .తెలుపు రంగు దుస్తులు - చేనేత వస్త్రాలు వాడాలన్నారు. బయటకు వస్తే గొడుగు లేదా టోపీ తప్పని సరిగా వాడాలి.కాలి కి చెప్పులు తప్పని సరిగా వాడాలి.
అన్ని గ్రామాల్లో ఉన్న ఆరోగ్య సిబ్బంది ని అప్రమత్తం చేసామని వారి వద్ద అత్యవసర మందులు   ఓ ఆర్ ఎస్ పాకెట్స్  సిద్దం గా ఉంచి నట్లు తెలియ జేసారు .  ఎవరికయినా వడ దెబ్బ లక్షణములు కనిపిస్తే సమీప ఆరోగ్య  సిబ్బందిని  మరియు సమీప ఆసుపత్రి వారిని  సంప్రదించాలని కోరారు.