Oct 16,2023 12:50

ప్రజాశక్తి - చాపాడు(కడప) : చాపాడు మండలాన్ని బాల్య వివాహాల రహితంగా తీర్చి దిద్దుటకు మహిళా సంఘాల సభ్యులు కృషి చేయాలని ఇందిరా క్రాంతి పథకం ఎపిఎం వెంకట రమణ, అంగన్వాడీ సూపర్వైజర్ సుబ్బరత్నమ్మ సూచించారు. సోమవారం చాపాడు, పల్లవోలులో  ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. ప్రజలకు బాల్య వివాహాల వలన కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.