Sep 17,2023 16:39

ప్రజాశక్తి-ఏలేశ్వరం: సమాజంలో ప్రతి మహిళ తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ న్యాయవాది అవసరాల దేవి పిలుపునిచ్చారు. ఏలేశ్వరం ఏడవ  సచివాలయంలో ఆదివారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సుకు దేవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా రక్షణకు ఉన్న ప్రత్యేక చట్టాలను వివరించారు. నిరక్షరాస్య మహిళలకు తోటి మహిళలు వ్రాయడం చదవడం నేర్పించడం ద్వారా సమాజంలో కొంతవరకైనా మార్పోస్తుందన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి మహిళ కనీస విద్య నేర్చుకోవాలి అని ఆమె కోరారు. ప్రతి కుటుంబంలోనూ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను కూడా చదివించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు కోర్ట్ ఎమ్మెల్యే అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, సచివాలయ మహిళా సిబ్బంది ఉన్నారు.