విజయవాడ : జగన్ పాలనలో దళితులపై దాడులు - ప్రభుత్వ పథకాలపై విజయవాడలోని ఐలాపురంలో తెలుగుదేశం దళిత విభాగం ఆధ్వర్యాన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దుర్మార్గమైన విధానాల వల్ల దేశంలో దళితులపై దుర్మార్గమైన, దారుణమైన కులదురంకార దాడులు జరుగుతున్నాయని జాతీయ క్రైం నేర రిపోర్ట్ తెలుపుతుందని బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయన్నారు. దళిత గిరిజనులకు గుండెకాయ రక్షణ లాంటి చట్టాలను నీరుకారిస్తే మన రాష్ట్ర అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏమాత్రం కూడా మాట్లాడలేదన్నారు. దళిత గిరిజన ప్రజాసంఘాల చేసిన పోరాట ఫలితంగా మనువాద మతోన్మాద కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు ఉండి కానీ అదనుకోసం చూస్తుంది. చట్ట సభల్లో బయట దుర్మార్గమైన కులదురంకార ప్రకటనలు చేస్తూ అమలు చేస్తుంది. కులవ్యవస్థ ఇలానే ఉండాలని అంటుంది. రిజర్వేషన్లు లేకుండా చెయ్యాలని చూస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకు అమ్మేస్తూ రిజర్వేషన్లు లేకుండ చేస్తున్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మేం అమలు చెయ్యం మనుస్మృతిని అమలు చేస్తామని చెబుతూ రాజ్యాంగాన్ని కాల్చివేస్తున్నారు. దేశంలోని మనువాద మతోన్మాదానాన్ని ముందుకు తీసుకుపోతున్న మోడీ చెప్పుల్లో మన రాష్ట్ర అధికార వైసిపి నడుస్తుంది. నూతన విద్యా విధానం తీసుకువస్తే బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా వెనుకాడితే మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందుగా అమలు చేస్తుంది. ఎస్ సి ఎస్ టి అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుకారుస్తున్నారు. జస్టిస్ పున్నయ్య కమీషన్ సిఫార్సులు అమలు చెయ్యడం లేదు. బాధితులకు రక్షణ కల్పించాల్సిన అధికార పక్షం ముద్దాయిలను కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్ సి ఎస్ టి అత్యాచార నిరోధక చట్టంలో బెయిల్ కి అవకాశం లేని సందర్భంలో కూడ 41 సిఆర్పిసి కింద బెయిల్ ఇస్తున్నారు. రాజ్యాంగ ఫలాలు రద్దు చేసినట్లు చూపకుండ అమలు చెయ్యడం లేదు. ఇలాంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దుర్మార్గమైన విధానాలపై రాజీలేని పోరాటం చెయ్యాలి. అందుకు తెలుగుదేశం ముందుండాలన్నారు. అలాకాకుండా రాష్ట్ర పరిస్థితులను చూస్తూ కేంద్ర పరిస్థితులను వదిలేస్తే నష్టం. ఆ నష్టానికి టిడిపి కారణం కాకుడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరాటం చెయ్యాలన్నారు. రాష్ట్ర, కేంద్రంలో జరుగుతున్న దాడులు దుర్మార్గమైన దారుణమైన దాడులపై ఎప్పటికప్పుడు ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్న కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యాన జూన్, జూలై నెలల్లో దళిత రక్షణ యాత్రలు జరుగుతున్నాయి. ఇందులో దళిత గిరిజన ప్రజాసంఘాలు మద్దతు పలకాలని కోరారు.










