Oct 27,2023 11:52

ప్రజాశక్తి-గోరంట్ల: గోరంట్ల పట్టణానికి చెందిన సీమ వార్త పేపర్ విలేఖరి ఈశ్వర్ పై గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం ఉదయం దాడి చేశారు. చంద్రశేఖర్ థియేటర్ సమీపంలో వెళ్తున్న ఈశ్వర్ పై విచక్షణ రహితంగా కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలు పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన విలేఖరి ఈశ్వరుని స్థానిక ఆసుపత్రికి ప్రధమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హిందూపురం ఆసుపత్రికి 108 వాహనంలో బంధువులు తీసుకెళ్లారు. జరిగిన ఘటనపై పోలీసులు సిసి కెమెరాలు పరిశీలిస్తున్నారు.