Aug 06,2023 11:51

జైపూర్‌  :  జైపూర్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ మేయర్‌పై మునేష్‌ గుర్జార్‌ను రాజస్తాన్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆమె భర్త సుశీల్‌ గుర్జార్‌ను రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో శనివారం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను కూడా సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కార్పోరేటర్‌ పదవి నుండి కూడా సస్పెండ్‌ చేసింది.  మేయర్‌ మునేష్‌ గుర్జార్‌ భర్త సుశీల్‌.. ఓ భూమి లీజ్‌ వ్యవహారంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ నిన్న ఎసిబికి దొరికిపోయాడు.  ఆ ఇంటి నుండి ఎసిబి అధికారులు రూ.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మేయర్‌ మునేష్‌ గుర్జార్‌ కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా ఏసీబీ అరెస్టు చేసి విచారిస్తోంది.