ప్రజాశక్తి-ఆదోని : కర్నూలు జిల్లాకి అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు రావడంతో అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడులు చేసి భౌతికంగా గాయపరచడానికి వ్యతిరేకంగా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా కమిటీ పిలుపుమేరకు సోమవారం జర్నలిస్టు యూనియన్‌తో కలిసి రాజకీయ, ప్రజా సంఘాలు నాయకులు చేపట్టిన నిరసనతో ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం దద్దరిల్లింది. అంతకుముందు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి భీమా సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపి సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి, జనసేన పార్టీ ఇన్‌ఛార్జీ ఎన్ మల్లప్ప, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్, సిపిఎం నాయకులు లక్ష్మణ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో నిత్యం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న విలేకరులపై దాడులు సరైనదన్నారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆరెకలు దేవదాసు మమ్మద్ గౌస్ హుసేని వెంకటేష్ విజయ్ రవి సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు విజయేంద్రనాథ్ ప్రసాద్, మల్లికార్జున, రవి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు మహేష్ యాదవ్, నాయకులు, టిడిపి నాయకులు జైరాం, సబ్జాద్, బాలాజీ, షణ్ముఖ, రవి చౌదరి, రవి, జనసేన నాయకులు తాహేర్ వలి, రాజశేఖర్ పాల్గొన్నారు.










