Apr 16,2023 15:00
  • భారీ అన్నదానాన్ని ప్రారంభించిన హౌసింగ్ చైర్మన్ దొరబాబు

ప్రజాశక్తి-సామర్లకోట : స్ధానిక బ్రౌన్ పేట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి దవులూరి దొరబాబు, రాష్ట్ర కార్మిక సంఘం నాయకులు దవులూరి సుబ్బారావు, రాష్ట్ర అయ్యారక కార్పొరేషన్ చైర్మన్ ఆవాల రాజేశ్వరి లక్ష్మీనారాయణలు అన్నారు. స్థానిక బ్రౌన్ పేట డాక్టర్ అంబేద్కర్ పార్కులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతోత్సవాల్లో భాగంగా ఆదివారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు పండగ వాతావరణంలో మూడు రోజులపాటు నిర్వహించి విద్యార్థులను, మహిళలను, క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా పలు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే ప్రజల ఆకలి తీర్చేందుకు భారీగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. రానున్న రోజుల్లో యువజన సంఘం ద్వారా మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని అతిధులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఐదువేల మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నాలుగో వార్డ్ కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కమిటీ నాయకులు అందుగల రాధాకృష్ణ, ఆర్ నవీన్ (సిద్దు), పిట్ట అశోక్ కుమార్, ఆందుగుల సత్యనారాయణ, బ్రౌన్ పేట వ్యవసాయ కూలీ సంఘం నాయకులు సలాది భీమేశ్వరరావు, బొడ్డు చిన్ని, దళిత సంఘాల నాయకులు జీవి రాఘవ, ఆర్ పల్లేశ్వర రావు, వి కొండలరావు, పలువురు కౌన్సిలర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.