Jul 25,2023 16:21

ప్రజాశక్తి- నందిగామ(ఎన్‌టిఆర్‌ జిల్లా) : భారీ వర్షాలతో ఆంధ్ర రాష్ట్ర నుండి తెలంగాణ వైపు రాకపోకల నిలిచిపోయాయి. ఎన్‌టిర్‌ జిల్లా నందిగామ మండలం కూడలి పల్లెంపల్లి నుండి మధిర మండలం చిలుకూరు వచ్చే వద్ద కట్టలేరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపాకలు తెగిపోయాయి. అలాగే నందిగామ-వీరులపాడు మండలాలకు రాక పోకలు నిలిచి పోయాయి. నందిగామ మండలం దాములూరు గ్రామం, వీరులపాడు మండలం పల్లంపల్లి గ్రామాల మధ్య కాజ్‌ వేపై వైరా నది, కట్టలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన రెవెన్యూ అధికారి నరసింహారావు రెండు గ్రామాల మధ్య రాకపోకలు 3 రోజుల పాటు నిలిపి వేశారు.

2