అత్యుత్తమ ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ ఎలాంటి లైసెన్స్ ఫీజూ లేకుండా సాంకేతికతకు సంబంధించిన తమ రోజువారీ పనులను సులభతరం చేస్తుంది. సులభంగా పూర్తిచేసేందుకు సహాయం చేస్తుంది. ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ అనేది ప్రపంచంలోని ఎవరైనా ఎలాంటి డబ్బూ చెల్లించకుండా డౌన్‌లోడ్ చేయగల, సవరించగల, పంపిణీ చేయగల ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ ప్లాట్‌ఫామ్ మీద పనిచేసే డెవలపర్లు ప్రత్యేకంగా ఓపెన్‌సోర్స్ లైసెన్స్ కింద ఆయా సాఫ్ట్‌వేర్లకు సంబంధించిన సోర్స్ కోడ్‌ను ఉచితంగా విడుదల చేస్తారు.
ఈ ఓపెన్‌సోర్స్ ఉద్యమం 1990 చివరలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఫిలాసఫీగా ప్రారంభమైనప్పటి నుండి, ఇది ప్రపంచ సాంకేతికత దృష్టినే మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వెబ్ సర్వర్‌లలో 96 శాతం ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్స్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతున్నాయని కూడా అంచనాలు సూచిస్తున్నాయి.
ఓపెన్ సోర్స్ అంటే కేవలం ''ఉచిత'' అని అర్థం కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. చాలా కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా విడుదల చేస్తాయి.. కానీ, తమ కోడ్‌కి పూర్తి కాపీరైట్ యాజమాన్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇతర డెవలపర్‌లు దానిని ఎడిట్ చేయలేరు. దీనికి విరుద్ధంగా, విజయవంతమైన ఓపెన్ సోర్స్ కార్యక్రమాలు అద్భుతమైనదాన్ని సృష్టించడానికి స్వచ్ఛందంగా తమ సమయాన్ని వెచ్చించిన వేలాది మంది డెవలపర్‌ల కషిపై ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్స్ నిర్మించబడ్డాయి. ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ సురక్షితమైనదనే పేరుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లు కొత్త కొత్త ఆవిష్కరణలను పరిశీలిస్తారు. ఈ క్రమంలో ఆయా సాఫ్ట్‌వేర్స్‌లో తలెత్తే బగ్‌లు వేగంగా పరిష్కరించబడతాయి. అలాగే, ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు మంచి కొత్త ఫీచర్‌లను జోడించడానికి ప్రజలు ప్రేరణ పొందుతారు. ప్రస్తుతం నెట్‌వర్క్‌ల నుండి వెబ్ సర్వర్‌ల వరకు ప్రతిదానిలో ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించబడుతున్నాయి. ఈ క్రమంలో డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోడానికి అవసరమైన ఉత్తమ ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్స్ కొన్నింటిని ఇక్కడ పరిచయం చేస్తున్నాం.
- విఎల్‌సి మీడియా ప్లేయర్..
వాస్తవంగా ఏదైనా ప్లే చేయగల ఓపెన్ సోర్స్ మీడియా ప్లేయర్ ఇది. విండోస్, మ్యాక్, లైనక్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లలోనూ ఇది పనిచేస్తుంది. విఎల్‌సి మీడియా ప్లేయర్ అనేది వీడియో లాన్ ప్రాజెక్ట్ అని పిలువబడే ఓపెన్ సోర్స్ డెవలప్‌మెంట్ గ్రూప్ ద్వారా రూపొందించబడిన తేలికపాటి అప్లికేషన్. ఈ వీడియో, మీడియా ప్లేయర్ జనాదరణ పరంగా చాలా సంవత్సరాలుగా పరిశ్రమను ముందుండి నడిపిస్తోంది. ఏ ఫార్మాట్‌లో అయినా ఆడియో, వీడియో ఫైల్‌లను తెరవడానికి విఎల్‌సి మీడియా ప్లేయర్‌ని ఉపయోగించవచ్చు. పాడ్‌కాస్ట్‌లు, ఆన్‌లైన్ రేడియో స్టేషన్‌ల వంటి స్ట్రీమింగ్ మీడియా కోసం కూడా పనిచేస్తుంది. హార్డ్‌వేర్ ఆప్టిమైజేషన్ నుండి థర్డ్-పార్టీ సోర్స్‌ల నుండి సబ్‌టైటిల్ ఫైల్‌లను జోడించడం వరకు మీ మీడియా ఎలా ప్రదర్శించబడుతుందో మీరు దాదాపు అన్నింటినీ మార్చవచ్చు.
- షాట్‌కట్..
ఓపెన్ సోర్స్ ఉచిత వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఇది. అంకితభావం కలిగిన డెవలప్‌మెంట్ కమ్యూనిటీ ఇచ్చిన సమయానికి ప్లాట్‌ఫారమ్‌ను ఎంతవరకు మెరుగుపరుచుకోగలదో నిజంగా ప్రదర్శించే ఓపెన్‌సోర్స్ ప్రోగ్రామ్‌లలో ఇదొకటి. మునుపట ికంటే కూడా ప్రస్తుతం అధునాతనంగా తయారైంది షాట్‌కట్. అదనపు డాక్ చేయగల ప్యానెల్‌లు, సహజమైన టైమ్‌లైన్, అడోబ్ ప్రీమియర్ ప్రో వంటి ప్రీమియం వీడియో ఎడిటర్‌ల వలే షాట్‌కట్‌ను అదే లీగ్‌లో ఉంచే ఇతర మెరుగుదలలను కూడా ఈ తాజా వెర్షన్‌లో జోడించాయి.
ఇవేకాకుండా పేజీ మేకర్, క్వార్క్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా స్క్రైబస్, మ్యూజిక్ ఎడిటింగ్ కోసం అడాసిటీ, కొరెల్‌డ్రా.. ఇలస్ట్రేటర్‌లకు ప్రత్యామ్నాయంగా ఇంక్‌స్కేప్, ఫైల్ ట్రాన్స్‌ఫర్ కోసం ఫైల్‌జిల్లా, చివరకు బ్రేవ్ పేరుతో అధునికంగా రూపొందిన బ్రౌజర్... ఇలా అనేక సాఫ్ట్‌వేర్లు ఓపెన్‌సోర్స్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉచితంగా లభ్యమయ్యేవే. వేలాది రూపాయలు వెచ్చించి, ప్రొప్రైటరీ సాఫ్ట్‌వేర్లను కొనుగోలు చేసే కంటే.. ఈ ఉచిత సాఫ్ట్‌వేర్లను వాడటం వల్ల అటు డబ్బు ఆదా.. ఇటు సెక్యూరిటీపరంగానూ ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
- లిబ్రే ఆఫీస్..
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్‌కి నిజమైన ఓపెన్‌సోర్స్ ప్రత్యామ్నాయం ఇది. విండోస్, మ్యాక్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇది ప్రతిభావంతంగా పనిచేస్తుంది. డాక్యుమెంట్‌లు, స్ప్రెడ్‌షీట్‌లు, డేటాబేస్‌లు, ప్రెజెంటేషన్‌లు, రేఖాచిత్రాలు, గణిత సూత్రాలకు మద్దతుతో, లిబ్రేఆఫీస్ తప్పనిసరిగా ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఉచిత వెర్షన్. ప్రత్యామ్నాయ ప్రసిద్ధ ఓపెన్ సోర్స్ ఆఫీస్ సాధనం ఓపెన్ ఆఫీస్, ఇది లిబ్రేఆఫీస్‌కు అనేక సారూప్య లక్షణాలను అందిస్తుంది. లిబ్రేఆఫీస్ ఈ రోజు అగ్రస్థానంలో ఉండడానికి కారణం మైక్రోసాఫ్ట్ ఫైల్ ఫార్మాట్‌లను సంరక్షించడంలో ఇది చాలా మెరుగ్గా ఉంది. మైక్రోసాఫ్ట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా దీని పనితనం ఉంటుంది.
- జింప్..
శక్తివంతమైన ఓపెన్ సోర్స్ ఫోటో, ఇమేజ్ ఎడిటింగ్ సాధనం జింప్. విండోస్, మ్యాక్, లైనెక్స్‌లో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఫొటోషాప్‌కు ఏకైక ప్రత్యామ్నాయం ఇది. లేయర్లు, ఫిల్టర్లు, మాస్క్‌లు వంటి అధునాతన ఎడిటింగ్, ఆర్‌జిబి, సిఎంవైకె కలర్ ఎడిటింగ్ టూల్స్ ఇందులో ఉన్నాయి. 1996 నుంచి లైనక్స్ వినియోగదారులకు ఫొటోషాప్ కొరతను తీర్చుతున్న సాఫ్ట్‌వేర్ ఇది.