ప్రజాశక్తి-వెల్దుర్తి : స్థానిక ఏఐటీయూసీ కార్యాలయం నందు ఏఐటీయూసీ అనుబంధమైన భవన నిర్మాణ కార్మికులు కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి విడుదల చేసిన సుమారు 400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు విడుదల చేయడం లేదు. అందువలన జూన్ 20రాష్ట్రవ్యాప్తంగా విజయవాడలో మహా ధర్నా చేయాలని నిర్ణయించాయి కరోనాకాలం నుండి నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిపోవడం వలన సామాన్యుడికి గృహం కట్టుకోవడం పెనుభారంగా మారింది. అందువలన భవన నిర్మాణ కార్మికులైన ప్రతి కార్మికునికి పని లేక జీవన ఉపాధి కోల్పోయి జీవించడం చాలా కష్టంగా మారింది అందువలన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ బోర్డు నిధులు అర్హులైన ప్రతి కార్మికునికి అందే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనియెడల పోరాటానికి సిద్ధంగా ఉండాలని కార్మికులకి కోరడమైనది. భవన నిర్మాణ కార్మికుడు జిల్లా అధ్యక్షుడు జి నాగమద్దయ్య మండల కార్యదర్శి చిన్నమాదులు మండల అధ్యక్షుడు బి ఆంజనేయులు ఏఐటీయూసీ మండలాధ్యక్షుడు మాధవస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏఐటీయూసీ సీనియర్ నాయకులు యేసయ్య హరిప్రసాద్ చంద్రశేఖర అప్ప బ్రహ్మ మౌలాలి చాందు పామయ్య వెంకటేష్ మొదలగువారు పాల్గొన్నారు.










