Jun 18,2023 15:11

ప్రజాశక్తి-ఏలేశ్వరం : రాజ్యాంగ విలువలు పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకమైనదని ఐలాజ్ కేంద్ర కమిటీ సభ్యులు బుగతా శివ అన్నారు. ఈనెల 25న విజయవాడలో జరిగే రాజ్యాంగ విలువలు పరిరక్షణ-న్యాయవాదుల పాత్ర అనే అంశంపై రాష్ట్ర సదస్సు విజయవంతానికై పోస్టర్ ను ఆయన ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం మాట్లాడుతూ సదస్సుకు ఐలాజ్ జాతీయ కార్యదర్శి కెప్టెన్, మాజీ న్యాయమూర్తులు ఎం రాజేంద్ర, జేసురత్నం ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం ఐలాజ్ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బండారు నరసింహారావు కందా వెంకటరాజు అనూహ్య పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.