Apr 20,2023 12:47

ప్రజాశక్తి-పెద్దకడబూరు : పెద్దకడబూరు మండలంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఇంచార్జి తాసిల్దార్ పూర్తిగా విఫలమయ్యారని సిపిఐ తాలూకా కార్యదర్శి భాస్కర్ యాదవ్ మండల కార్యదర్శి వీరేష్ సిపిఐ కమిటీ సభ్యులు రాజు ఏఐకేఎస్ తాలూకా కార్యదర్శి మబ్బు ఆంజనేయ విమర్శించారు గురువారం పెద్దకడబూరులోని మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఏ ఐ కె ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్చార్జి తహసిల్దార్ వీధి నిర్వహణలో రాజకీయ నాయకులకు ఓ రకంగా సమస్యలకు మరోరకంగా చేస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలు పరిష్కరించని తాసిల్దార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ నాయకులు రైతులు తదితరు మహిళలు పాల్గొన్నారు.