Jun 16,2023 23:10
  • వేలాదిగా కూలిన విద్యుత్‌ స్తంభాలు
  • వెయ్యి గ్రామాలు అంధకారంలోనే
  • కూకటి వేళ్లతో కూలిన మహా వృక్షాలు
  • యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరుద్ధరణ పనులు
  • ముఖ్యమంత్రికి ప్రధాని ఫోన్‌

కచ్‌ : గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుజరాత్‌ తీరానిు దాటిన బిపర్‌జోయ్ (బిపర్‌జోయ్ అంటే బెంగాలీలో విపత్తు అని అర్థం) తుపాను కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాలకు పెను విధ్వంసాన్ని మిగిల్చింది. ముఖ్యంగా విద్యుత్‌ రంగం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వందలాది విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో వెయ్యికి పైగా గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. తుపాను తీరం దాటిన తర్వాత ఈదురు గాలులు, కుండపోత వర్షాలు కురుస్తుండడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీర ప్రాంతాల్లో పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్నాయని అధికారులు శుక్రవారం తెలిపారు. తుపాను కారణంగా ప్రాణ నష్టం జరగలేదనిచెప్పారు. అధికార యంత్రాంగం సాధించిన అతిపెద్ద విజయం అదేననిసీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు. ఆర్థికంగా మాత్రం రాష్ట్రానికి పెను నష్టానిు కలిగించిందనాురు. ముఖ్యంగా విద్యుత్‌ రంగానికి జరిగిన నష్టం తీవ్రంగా వుందన్నారు. 5,120 విద్యుత్‌ స్తంభాలు తుపానుకుదెబ్బతినాుయి. వాటినిపునరుద్ధరించే చర్యలు ప్రారంభమయ్యాయనిరాష్ట్ర రిలీఫ్‌ కమిషనర్‌ అలోక్‌ కుమార్‌ పాండే తెలిపారు. మొత్తంగా 4,600 గ్రామాలకువిద్యుత్‌ సౌకర్యం కొరవడిందని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతో 3,580 గ్రామాలకువిద్యుత్‌ను పునరుద్ధరించామనిచెప్పారు. మిగిలిన గ్రామాల్లో పనులు వేగంగా జరుగుతునాుయనాురు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతునాుయనాురు. మోర్బీలోనిమలియా తాలుకాలో రెండు విద్యుత్‌ స్టేషన్లను కూడా మూసివేయాల్సి వచ్చింది. మూడు రాష్ట్ర హైవేలను మూసివేసినట్లు చెప్పారు. మహా వృక్షాలు సైతం కూకటి వేళ్లతో సహా నేల కూలి రోడ్లకుఅడ్డంగా పడడంతో మూసివేయాల్సి వచ్చిందనాురు. ఇప్పటికి అందిన వార్తలను బట్టి మొత్తంగా 800 వృక్షాలు నేలకూలాయి. దాదాపు 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరో 500 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినాుయి. ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది రోడ్లపై పడిన చెట్లను తొలగించి రోడ్లను రాకపోకలకుఅనువుగా మార్చడానికి కృషి చేస్తునాురనితెలిపారు. తుపాను వల్ల నష్టపోయిన వారికి తక్షణమే నష్టపరిహారం అందేలా చూస్తునాుమనిపాండే చెప్పారు. తుపాను తీరం దాటినా ప్రచండ వేగంతో గాలులు వీస్తునుందున ప్రజలు ఇళ్లవద్దనే వుండాలనిభుజ్‌ అధికారులు కోరారు. బలహీనపడిన తుపాను రాజస్థాన్‌ దిశగా పయనించడంతో అక్కడ భారీ వర్షాలు కురుస్తునాుయి.
తుపాను ప్రభావానిు, కలిగించిన నష్టానిు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ శుక్రవారం అధికారులతో కలిసి సమీక్షించారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు, ఇతర సహాయక చర్యలు సాగుతునాుయనిముఖ్యమంత్రి చెప్పారు. 18వ తేదీ వరకు99 రైళ్లను రద్దు చేశారు.

  • ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాని మోడీ

సిఎం భూపేంద్ర పటేల్‌తో ప్రధానినరేంద్ర మోడీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితులను అడిగి తెలుసుకునాురు. గిర్‌ అడవుల్లో సింహాలతోసహా వన్యప్రాణులకుచేపట్టిన భద్రతా ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకునాురు. రైల్వే మంత్రి రైల్వే ట్రాక్‌ల నిర్వహణ, ఇతర అంశాలపై అధికారులతో మాట్లాడారు.