Feb 26,2023 22:24
  • నెల రోజుల్లో 3 నుంచి 30వ స్థానానికి..

న్యూఢిల్లీ : గౌతమ్‌ అదానీకి చెందిన పది లిస్టెడ్‌ కంపెనీల సంపద దాదాపు రూ.12 లక్షల కోట్లు ఆవిరైనట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. గత నెల 24న హిండెన్‌బర్గ్‌ నివేదిక విడుదలైన అనంతరం ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉను అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ నెల రోజులు తిరిగే సరికి తాజా ప్రపంచ బిలియనీర్‌ సూచీలో 30వ స్థానానికి పడిపోయారు. నివేదిక వెల్లడికి ముందు 120 బిలియన్‌ డాలర్ల సంపదతో ఉను అదానీ ఏకంగా 80.6 బిలియన్ల సంపదను కోల్పోయారు. ఫ్రాన్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తును అదానీ గ్యాస్‌ లిమిటెడ్‌ మార్కెట్‌ విలువ గత నెలరోజుల్లో 80.68 శాతం పడిపోగా, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 74.62 శాతం మేర నష్టపోయింది. జనవరి 24 నుంచి ఇప్పటివరకూ అదానీ ట్రాన్స్‌మిషన్‌ విలువ 74.21 శాతం పడిపోయింది. అదానీ పవర్‌, అదానీ విల్మర్‌, సిమెంట్‌ యూనిట్స్‌, మీడియా, అదానీ పోర్ట్స్‌, సెజ్‌ల మార్కెట్‌ విలువ గణనీయంగా తగ్గిపోయింది. వ్యాపార రంగంలో పోటీదారైన ముకేష్‌ అంబానీ ఆసియాలోనే మూడో అత్యంత సంపనుుడిగా కొనసాగుతూ, ప్రపంచ సంపనుుల జాబితాలో 10వ స్థానంలో ఉనాురు. ఆయన ప్రస్తుత సంపద విలువ 81.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది.