Oct 29,2023 09:11
  • దర్శకుడు మహేష్‌ భట్‌ కూతురిగా ఇండిస్టీలోకి ఎంట్రీ ఇచ్చారు అలియా భట్‌. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' తొలి సినిమాలో నటించి ప్రేక్షలకు దగ్గరయ్యారు. వరుస అవకాశాలతో బాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే మంచినటిగా పేరు సంపాదించుకున్నారు. 'గంగూబాయి కతియావాడి' లో తన నటనకు గానూ 'ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర' అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి, తాను ఈ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించిన కుటుంబసభ్యులకు సోషల్‌మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. వారికే ఈ విజయాన్ని ప్రేక్షకులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అలియా గురించి తెలుసుకుందాం.

అలియా భట్‌ చిత్రనిర్మాత, దర్శకుడు మహేష్‌ భట్‌, నటి సోనీ రజ్దాన్‌కు జన్మించారు. ఆమె తల్లి యుకె నుండి వచ్చినందున ఆమె బ్రిటిష్‌ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. అలాగే మనదేశంలో ఎలాగూ పౌరురాలే. దీంతో ఆమెకు ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. అలియాకు షాహీన్‌ భట్‌, పూజా భట్‌ ఇద్దరు తోబుట్టువులు, రాహుల్‌ భట్‌ అనే సోదరుడు ఉన్నారు. తన పాఠశాల విద్యను ముంబైలోని జమ్నాబాయి నర్సీ అనే పాఠశాల్లో పూర్తిచేశారు. చిన్నప్పుడు ఆమెను 'ఆలూ' అని ముద్దుగా పిలుచుకునేవారు. పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు ఆమె బొగ్గు పెయింటింగ్‌ పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. ఇప్పటికీ ఆమె ఆ అభిరుచిని కొనసాగిస్తున్నారు.

  • వరుస అవకాశాలు

ఆలియా, ఇంతియాజ్‌ అలీ చిత్రం, 'హైవే'లో రణదీప్‌ హుడా సరసన నటించారు. స్టారఖహోమ్‌ను అభివృద్ధి చేసే ఒంటరి అమ్మాయి పాత్రను పోషించినందుకు ఉత్తమనటిగా ఫిల్మ్‌ఫేర్‌ క్రిటిక్స్‌ అవార్డును అందుకున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌ విడుదల చేసిన '2 స్టేట్స్‌' చిత్రంలో భట్‌ ఒక తమిళ అమ్మాయి పాత్రను పోషించారు. దానిలో ఆమె నటన వీక్షకులచే మంచి ప్రశంసలు అందుకున్నారు. దీని తర్వాత 'హంప్టీ శర్మ'లో దుల్హనియాలో వరుణ్‌ ధావన్‌ సరసన నటించారు. ఇది బాక్సాఫీస్‌ విజయవంతమైంది. అయితే, 2016 లో ఆమె మొదటి విడుదలైన కపూర్‌ అండ్‌ సన్స్‌, ఒక కుటుంబ కథా చిత్రం, విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయవంతమైంది. పనికిరాని కుటుంబానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడే యువతి పాత్రలో అలియా అద్భుతంగా నటించారు. దాంతో బ్రేక్‌ లేకుండా వరుసగా ఆమెకు అవకాశాలు రాసాగాయి. గౌరీ షిండే దర్శకత్వం వహించిన 'డియర్‌ జిందగీ' చిత్రంలో, ఆమె పరిపూర్ణ జీవితాన్ని వెతుకుతున్న ఔత్సాహిక సినిమాటోగ్రాఫర్‌ కైరా పాత్రను పోషించారు. షారూఖ్‌ఖాన్‌తో కలిసి నటించిన ఆలియా భట్‌ ఈ చిత్రాన్ని తన భుజాలపై మోసినందుకు చాలా ప్రశంసలు అందుకున్నారు.
సంజరు లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన 2022లో 'గంగూబాయి కతియావాడి' చిత్రంలో ఆలియా భట్‌ టైటిల్‌ రోల్‌లో ఓ వేశ్య పాత్రలో నటించారు. హుస్సేన్‌ జైదీ రచించిన 'మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై' ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఇందులో ఈ సినిమా కథ కన్నా.. అలియా నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఉత్తమ నటిగా పేరు సంపాదించారు.

  • అధికంగా 16 కిలోలు తగ్గి..

సంఘర్ష్‌ (1999) లో ఆమె బాలనటిగా రంగప్రవేశం చేశారు. అక్కడ ప్రీతీ జింటా పోషించిన ప్రధానపాత్రలో చిన్న వయస్సులో నటించారు. అప్పటి నుంచి చదువుకుంటూనే బాలీవుడ్‌ పరిశ్రమలో రాణిస్తున్నారు. దశాబ్దం తర్వాత, ఆమె కరణ్‌జోహార్‌లో ప్రధాననటిగా మొదటి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ పాత్ర కోసం భట్‌ మూడు నెలల్లో 16 కిలోల బరువు తగ్గి చూపారు. అందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సంగీత దర్శకుడు ముఖేష్‌ భట్‌ ఆమె మామయ్య. దాంతో ఆమె సంగీతం పట్లా ఆసక్తి కనబరచడంతో ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీత పాఠశాలలో కొంతకాలం శిక్షణ తీసుకున్నారు. అందులో భాగంగానే 'హైవే' సినిమాలో ఆమె ప్లేబ్యాక్‌ సింగింగ్‌ చేశారు. కొన్ని సినిమాల్లో పాటలూ పాడారు. ఆమె అనేక ప్రసిద్ధ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గానూ ఉన్నారు. దుస్తులు, హ్యాండ్‌బ్యాగ్స్‌ పరిశ్రమలను ఆమె స్వంతగా స్థాపించి, నిర్వహణ బాధ్యతలూ చూస్తున్నారు. ఆలియా పర్యావరణవేత్త కూడా.కోఎక్సిస్ట్‌ అనే పర్యావరణ సంబంధమైన కార్యక్రమానికి 2017లో నాయకత్వం వహించారు. వీధి జంతువుల సంక్షేమం గురించి పలు అవగాహనా సదస్సులు నిర్వహించారు.
పేరు : ఆలియా భట్‌
జననం : 1992 మార్చి 15
నివాసం : ముంబై
జీవిత భాగస్వామి : రణబీర్‌ కపూర్‌