Jul 15,2023 16:44

ప్రజాశక్తి-కొండాపురం : నకిలీ రిపోర్టరుపై కేసు నమోదు నమోదు జరిగిన సంఘటన కొండాపురం మండలం కేంద్రంలోని పోలీసు స్టేషన్ పరిథిలో జరిగినది. కొండాపురం మండలం యస్.తిమ్మాపురం గ్రామానికి చెందిన మంజుల శ్రీనివాసులు గత కొంతకాలంగా ప్రజాశక్తి పత్రిక రిపోర్టరును అనిచెప్పి అధికారులను బెదిరిస్తున్నారని తమ దృష్టికి వచ్చినదని అందువలన తమకు, తమ పత్రిక, పరువుకు భంగం కలుగుఛున్నదని స్థానిక ప్రజాశక్తి పత్రిక రిపోర్టరు వెల్లాల లింగేశ్వరరెడ్డి పిర్యాదు చేయడంతో కొండాపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు యస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంజుల శ్రీనివాసులును అదుపులోకి తీసుకొని తహశీల్దార్ ఎదుట హాజరుపరచినట్ల యస్సై తెలిపారు. కొండాపురం తహశీల్దార్  విచారణ జరిపి బైండోవర్ కేసు నమోదు చేసి స్వంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు తహశీల్దార్ శోభన్ బాబు తెలిపారు.