Oct 25,2023 12:33

ప్రజాశక్తి-ఆత్మకూరు : మండలంలో ఉన్న నర్సరీలు 100 ఎకరాలు దాకా ఏర్పాటు చేశారు. ఈ నర్సరీలు ప్రభుత్వం చేత గుర్తింపు పత్రాలు మరియు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని చట్టాలు ఉన్న వాటిని అమలు చేయడంలో అధికారులు విఫలమైనారని స్థానిక రైతులు అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నర్సరీ రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సు తప్పనిసరి ఉండాలి అలాంటి వారు మాత్రమే ప్రభుత్వం  హార్టికల్చర్ అధికారుల ఆదేశాల మేరకు విత్తనాలు కొనుగోలు చేసి ఆ మొక్కలనే రైతులకు అమ్మాలని అలా రైతులు ఒకవేళ పంట దిగుబడి మరియు నష్టం వాటిల్లిన నర్సరీ వారు ప్రభుత్వంతో అనుసంధానమై పంటల బీమా ఏర్పాటు చేసుకుని నష్టపోయిన రైతులకు పంటల భీమ వర్తింపచేయాలని ఆదేశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే నర్సరీలు మాత్రం మండలంలో పదిమంది ఉన్న కేవలం ఇద్దరు మాత్రమే ప్రభుత్వ అనుమతి మరియు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగిలిన వాళ్లు ఎలాంటి అనుమతులు లేకున్నా రిజిస్ట్రేషన్ లో లేకుండా జరుపుతున్నారు. అలాంటి వారిని గుర్తించడంలో ఆర్టికల్స్ అధికారులు విఫలమైనారని స్థానిక రైతులు అన్నారు. మండలంలో ఎక్కడ నర్సరీలు ఉన్నాయి వాటి పేర్లు దానికి సంబంధించిన యజమాని ఎవరు ప్రాథమిక సమాచారం సైతం అధికారులు మరియు ఆర్బికే వాళ్లు గుర్తించలేదని స్థానిక రైతులు అంటున్నారు మిరప మరియు టమోటా రైతులు ఎక్కువ ధర పెట్టి మొక్కను కొనుగోలు చేయడం పంట దిగుబడి తగ్గిపోవడం రైతులు భారీగా నష్టపోతున్నామని అధికారులు పర్యవేక్షించి గుర్తింపు లేని నర్సరీలను రద్దు చేయడం నాణ్యతను పాటించేలా నర్సరీ వారికి ఆదేశాలు ఇవ్వడం చేయాలని స్థానిక రైతులు కోరుచున్నారు ఒక ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి మిరప మరియు టమోటా పంట సాగు చేస్తే పంట దిగుబడి రాకపోతే రైతులు ఎవరిని అడగాల జిల్లా అధికారులు స్పందించి ఉన్న నర్సరీలు పై చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు మండల రైతులు వాపోతున్నారు.