ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా : వీరులుపాడు మండలం అల్లూరు గ్రామ సచివాలయం-1లో ఏసీబీ దాడులు చేపట్టారు. వీఆర్వో టి.శివరామకృష్ణ రూ.4000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దోడ్డదేవరపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ అల్లూరు గ్రామ వీఆర్వో గా పని చేస్తున్నాడు. పిల్లి రవికిరణ్ 50సెట్ల పొలం పట్టాదారు పాసుబుక్ పుస్తకం ముటిషన్ కొరకు లంచం అడిగినట్లు సమాచారం. రామకృష్ణపై గత కొన్ని రోజులుగా అవినీతి ఆరోపణలు ఉండటంతో ఏసీబీ దాడులు నిర్వహించి పొలంలో రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటూ పట్టుబడినాడు. గత కొంతకాలం నుండి రెవిన్యూ అధికారులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. రైతులు ఏ చిన్న అవసరం వచ్చినా రెవిన్యూ కార్యాలయాన్ని వచ్చి తమ దరఖాస్తులు పలు సమస్యలపై అధికారులు తీసుకెళ్తున్నారు. పై అధికారులు కిందిస్థాయి అధికారులపై ఎలాంటి ఆదేశాలు ఇచ్చి పాటించకుండా రైతులు వద్ద పెద్ద ఎత్తున ముడుపులకు ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా భూమికి సంబంధించిన మార్పులు కానీ పాస్ పుస్తకాలు దరఖాస్తులు పరిశీలించి ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లాలంటే గ్రామ రెవెన్యూ అధికారులే సిఫార్మర్ కే పాస్ పుస్తకం పంపిణీ జరుగుతుంది.










