Jun 28,2023 14:13

ప్రజాశక్తి- చందర్లపాడు : చందర్లపాడు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేశారు. గ్రామ విఆర్ఓ రూ.5000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుపడ్డాడు. పొలాలకు సంబంధించి పాస్ పుస్తకాల విషయమై ఒక రైతును లంచం అడిగినట్లు లంచం ఇచ్చుకొలేని స్థితిలో రైతు ఏసిబిని ఆశ్రయించడంతో ఈ దాడులు జరిపి రెడ్ హ్యాండెడ్ గా వీఆర్వోని పట్టుకున్నట్లు సమాచారం. దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.