Aug 01,2023 12:38

నూజెండ్ల (పల్నాడు) : పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ముప్పరాజువారిపాలెం గ్రామం నుంచి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నారా లోకేష్‌ కు ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌ బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు ఎరపతినేని శ్రీనివాసరావు, కొమ్మలపాటి శ్రీధర్‌, పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, నరసరావుపేట ఇన్చార్జి చదలవాడ అరవింద్‌ బాబు, మాచర్ల ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి, తదితరులు లోకేష్‌ కు ఘన స్వాగతం పలికారు.