Jun 19,2022 12:01

కొన్ని సార్లు
నీలో నువ్వే ఆలోచించుకోవాలి
ఎందుకంటే
మంచిని కోరే వాళ్ల కంటే
ద్రోహ చింతనులే
ఎక్కువ మంది ఈ లోకంలో

కొన్నిసార్లు
నీ దారి నువ్వే ఎంచుకోవాలి
ఎందుకంటే
దారి దీపాలైన వాళ్లకంటే
మారీచుల మూకే
ఎక్కువ మంది ఈ లోకంలో

కొన్నిసార్లు
నీకు నువ్వే భుజం తట్టుకోవాలి
ఎందుకంటే
వెన్నుతట్టి ప్రోత్సహించే వాళ్లకంటే
వెన్నుపోటు పొడిచే వారే
ఎక్కువమంది ఈ లోకంలో

కొన్నిసార్లు
మౌనంగా మిగిలిపోవడమే మేలు
ఎందుకంటే
సత్యశోధనా మహాత్ముల కంటే
మూర్ఖ శిఖామణులే
ఎక్కువ మంది ఈ లోకంలో

- పేరూరు బాలసుబ్రమణ్యం
98492 24162