అతడు..
అనివార్యంగా ఒంటరితనపు జ్ఞాపకాలను
ఎక్కడ పోగొట్టుకున్నాడో
అక్కడే వెతుక్కుంటున్నాడు
పలవరింతల నదుల్లో మునిగి తేలుతూ
యాతమేసి ..
బాధలను తోడిపోసుకుంటున్నాడు
కెరటం నేర్పిన పాఠాలు
నిరంతరం బట్టీ పడుతూ
నిత్యసంఘర్షణల్ని
జ్వలన కాంక్షతో గానం చేస్తున్నాడు
అన్ని ఋతువులూ
రోగాల ఋతువులైనప్పుడు
అతడి మనసుపువ్వులో
దట్టంగా పట్టిన
ఆలోచనల ముసురు మేఘాలు
కురుస్తున్నాయి భారీ వర్షంలా -
ఏక్తార సితారపై
పొరలు పొరలుగా విప్పుకుంటూ
అతడిని అతడే
ఆవిష్కరించుకుంటున్నాడు
విల్సన్ రావు కొమ్మవరపు
77801 64914