ప్రజాశక్తి-మంగళగిరి రూరల్(గుంటూరు) : మంగళగిరి -తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధి యర్రబాలెం పీఏసీఎస్ ఛైర్మన్ తాడేకోరు రమేష్ గురువారం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. యర్రబాలెం పీఏసీఎస్ ఛైర్మన్‌గా తన పదవీ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే ఆర్కేకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గుండాల శ్రీనివాసరావు, పీఏసీఎస్ డైరెక్టర్ క్రోసూరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.










