ప్రజాశక్తి-ఆదోనిరూరల్ (కర్నూలు) : పేదలకు అండగా వైఎస్‌ఆర్ బీమా నిలుస్తోందని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆరెకల్ గ్రామనికి చెందిన యోహాను ఈ సంవత్సరం జనవరి నెలలో బాణాసంచా పేలుస్తూ మృతి చెందాడు. ఆయన కుటుంబానికి వైఎస్‌ఆర్ బీమా కింద మంజురైన రూ.5 లక్షలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి అండగా నిలిచేలా వైఎస్‌ఆర్ బీమా పథకం అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గీతవాణి, గ్రామ సర్పంచ్ లోహిత స్వామి, వైఎస్‌ఆర్ సీనియర్ నాయకులు తిమ్మా రెడ్డి, ప్రకాష్, రాముడు, సచివాలయ సిబ్బంది హనుమేష్ పాల్గొన్నారు.










