ప్రజాశక్తి తుగ్గలి(కర్నూలు) : గ్రామాల అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. గురువారం మండలం పరిధిలోని కోతి కొండ ఎద్దులదొడ్డి గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం స్థానిక నాయకులు వైస్ ఎంపీపీ మల్లికార్జున రెడ్డి, ఈశ్వర రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి ఇంటింటికి తిరిగి వారి సమస్యలను, వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పులి కొండ నాయక్, వైసిపి మండల కమిటీ అధ్యక్షులు జిట్టా నాగేష్ యాదవ్, సచివాలయం మండల కన్వీనర్ హనుమంతు, వర్క్ బోర్డ్ డైరెక్టర్ టిఎండి హుసేని, రాతన మోహన్ రెడ్డి, తుగ్గలి మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










